Share News

హేమంత్‌ సోరెన్‌కు హైకోర్టులో నిరాశ

ABN , Publish Date - May 04 , 2024 | 05:21 AM

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు శుక్రవారం హైకోర్టులో నిరాశ ఎదురయింది.

హేమంత్‌ సోరెన్‌కు  హైకోర్టులో నిరాశ

ఈడీ కేసు కొట్టివేతకు నిరాకరణ

రాంచీ, మే 3: ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు శుక్రవారం హైకోర్టులో నిరాశ ఎదురయింది.

మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ ఆయన చేసిన వినతిని తిరస్కరించింది.

ఏడు గంటల పాటు విచారించిన అనంతరం ఈడీ ఆయనను జనవరి 31న అరెస్టు చేసింది.

ఈ కేసును కొట్టివేయాలంటూ తాను చేసిన వినతిపై హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదంటూ ఆయన గత నెలలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తాజాగా హైకోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తూ కేసు కొట్టివేతకు నిరాకరించింది .

Updated Date - May 04 , 2024 | 05:21 AM