శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - May 13 , 2024 | 05:05 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేంద్ర, జస్టిస్ మన్మథరావు ఆదివారం ఉదయం బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేంద్ర, జస్టిస్ మన్మథరావు ఆదివారం ఉదయం బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పాల వెంకటరమణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ ఇందిరేష్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.