తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.

ఇటీవల రూ.1161కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లతో ముఖ్యాంశాలలో నిలిచింది. గత 12సంవత్సరాలతో  పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

గత దశాబ్దం నుండి ప్రతి సంవత్సరం రూ.500కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తున్న ఏకైక హిందూ సంస్థగా  టిటిడి నిలుస్తోంది.

2017లో అత్యధికంగా రూ.1153కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు  చేసింది.

ఏప్రిల్ 2024 నాటికి టిటిడి తన బ్యాంక్ ఖాతాలు, అనుబంధ ట్రస్టులలో రూ. 18817 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది.

ఫిక్సిడ్ డిపాజిట్ల నుండి మాత్రమే టిటిడి కి వస్తున్న వార్షిక ఆదాయం రూ.1600కోట్లు.

టిటిడి గోల్డ్ డిపాజిట్లు కూడా 11,329 కిలోలకు పెరిగాయి. 2024లో టిటిడి గోల్డ్ డిపాజిట్లు 1031 కిలోలు.

టిటిడి కి వచ్చే విరాళాలతో వెంకటేశ్వర అన్నదానం ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్ వంటివి నిర్వహించబడుతున్నాయి.