Home » Telangana
తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.శనివారం వరంగల్‌లో పర్యటించారు. కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
వర్షం స్వల్ప విరామం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం తర్వాత హైదరాబాద్(hyderabad)లో మళ్లీ వర్షం(rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు వానలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.
గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 125 మెట్రో డీలక్స్ బస్సులు, 25 ఎలక్ర్టిక్ బస్సులు ఉండనున్నట్లు, వీటిని విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
మాజీమంత్రి మల్లారెడ్డిని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారా..? అందుకే వరసగా భూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారా..? అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు.
మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాడని.. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చేస్తారనడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ విశ్వాసాలను రెచ్చగొట్టుతున్నాడని.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రామాలయం దేవాలయ గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీయే అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్‌శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్ పరిధిలో అరగంట విద్యుత్(Power Supply Off) బంద్ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్సీ(లైన్ క్లియరెన్స్) ఇచ్చేందుకు విద్యుత్‌శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.