Home » Food and Health
బయటి ఆహారం తినడం వల్ల కొన్ని సార్లు కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది. బయటి ఆహారాల తయారీలో కుళ్లిన పదార్థాలు, మురిగిపోయిన మసాలాలు, ఎక్కువసార్లు వాడిన నూనె, నాణ్యత లేని దినుసులు వాడటం వల్ల ఆహారం తినడానికి రుచిగా ఉన్నా ఆ తర్వాత పుడ్ పాయిజన్ కు దారితీస్తుంది.
వారానికి కనీసం 150 నుంచి300 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం అవసరం. 75 నుంచి 150 నిమిషాల తీవ్రమైన వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనితో మంచి ఫలితం ఉంటుంది.
శరీరానికి ఆరోగ్యం కలిగించే వాటిలో సెలెరీ ఒకటి. సెలెరీ జ్యూస్ శరీరానికి చాలామంచిది. ఈ జ్యూస్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. సెలెరీ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటంటే..
కిడ్నీలు పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు, లవణాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లవు. అంతేనా ప్రతి రోజూ 170 లీటర్ల రక్తాన్ని మూత్రపిండాలు వడపోస్తాయి. ఈ కారణంగా మూత్ర పిండాలు శరీరంలో చాలా కీలకం అని అర్థం అవుతుంది. అయితే మూత్రపిండాలకు సంబంధించి చాలామందిలో ఎదురయ్యే సమస్యలలో రాళ్లు ఏర్పడటం ఒకటి.
రోజ్మేరీని చాలామంది జుట్టు పెరుగుదల కోసం ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టు పెరుగుదలను, జుట్టుకు బలాన్ని, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకే రోజ్మేరీ నూనెను, రోజ్మేరీ సీరమ్, రోజ్మేరీ స్ప్రే మొదలైనవి జుట్టు పెరుగుదల కోసం వాడుతుంటారు. అయితే రోజ్మేరీని కేవలం సౌందర్య సాధనంగానే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడచ్చు.
బూడిదగుమ్మడిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉన్నాయి. అయితే ఇందులో 96శాతం నీరు కూడా ఉంటుంది. ఎలివేటెడ్ ఎనర్జీ లెవల్స్ మెరుగైన ఊపిరితిత్తులు పనితీరు, మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.
బయటకు వెళ్లి బాగా అలసిపోయి ఇంటికి చేరగానే నిమ్మరసం నీళ్లు తాగితే అదొక గొప్ప రిలాక్సేషన్. ఇక వేసవి కాలంలో అయితే నిమ్మరసానికి,నిమ్మకాయలకు చాలా డిమాండ్ ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని
పెద్దవాళ్లు అయితే ఇష్టం లేకపోయినా ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తి కోసం కొన్ని రకాల ఆహారాలను బలవంతంగా అయినా తీసుకుంటూ ఉంటారు. కానీ చిన్న పిల్లలు తమకు నచ్చని ఆహారాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఈ కారణంగా పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
ఆరోగ్యం కోసం వైద్యులు తరచుగా సూచించే నూనెలలో ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ను వంటల్లో ఉపయోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు, వివిధ రకాల పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. పిత్త రసాన్ని ఉత్పత్తి చేయడం, రక్తాన్ని శుభ్రపరచడం, జీర్ణక్రియను సజావుగా నిర్వహించడం, శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను నిల్వ చేయడంలో కాలేయం పనిచేస్తుంది. ఆహారం సరిగా లేకుంటే లేదా చెడు జీవనశైలి అలవాట్ల వల్ల కాలేయం దెబ్బతింటుంది.