Share News

SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. 300 కొడతారా?

ABN , Publish Date - May 02 , 2024 | 07:14 PM

ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గత సీజన్లలో...

SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. 300 కొడతారా?
Sunrisers Hyderabad Won The Toss And Chose To Bat

ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గత సీజన్లలో ఎన్నడూ లేనంత ఫుల్ జోష్‌లో ఉన్న హైదరాబాద్ జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాల్ని చవిచూసింది. దీంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. రాజస్థాన్‌పై అఖండ విజయాన్ని నమోదు చేసి.. ప్రస్తుతమున్న ఐదో స్థానం నుంచి ఎగబాకి, టాప్-4లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది.


ఇదే సమయంలో.. సన్‌రైజర్స్‌లో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు కాబట్టి, ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 300 పరుగులు కొట్టగలుగుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ జట్టు ఏకంగా మూడుసార్లు 260+ పరుగులను నమోదు చేసింది. అందునా.. 287 పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. 300 పరుగుల దరిదాపుల్లోకి వచ్చింది కాబట్టి.. ఆ మార్క్‌ని అందుకోవడం సన్‌రైజర్స్‌కి పెద్ద కష్టమేమీ కాదని అందరూ అనుకుంటున్నారు. మరి.. అభిమానుల అంచనా మేరకు సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో 300 పరుగులు చేయగలుగుతుందా? లేదా? అనేది చూడాలి.

మరోవైపు.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తిరుగులేని జట్టుగా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆర్ఆర్.. కేవలం ఒక్కసారే ఓటమి చవిచూసింది. మిగతా ఎనిమిది మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ జైత్రయాత్రను ఇలాగే కొనసాగించాలని భావిస్తున్న ఈ జట్టు.. హైదరాబాద్‌పై కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో? ఎవరు ఓటమి పాలవుతారో.. వేచి చూడాల్సిందే.

Updated Date - May 02 , 2024 | 07:14 PM