Share News

RCB vs GT: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ చేసేందుకు జీటీ రంగంలోకి..

ABN , Publish Date - May 04 , 2024 | 07:17 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.

RCB vs GT: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ చేసేందుకు జీటీ రంగంలోకి..

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు జీటీ రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్ రెండు జట్లకూ ఎంతో కీలకమైంది. ఈ మ్యాచ్‌లో ఏ ఒక్కరూ ఓడినా.. ఫ్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే! ఆర్సీబీ కథ ఇప్పటికే కంచికి చేరింది కానీ, గుజరాత్‌కి మాత్రం ఈ మ్యాచ్ ఎంతో ప్రధానమైంది. ఆ జట్టుకి ఇది డూ ఆర్ డై లాంటి మ్యాచ్.


ఇప్పటివరకూ ఐపీఎల్‌లో నాలుగు సార్లు తలపడిన ఈ ఇరు జట్లు.. చెరో రెండు విజయాలు సాధించాయి. అయితే.. ఈ సీజన్‌లో రెండు జట్లు మంచి ప్రదర్శన చేయడం లేదు. ఆర్సీబీ ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడి.. 3 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి (10వ) స్థానంలో ఉంది. ఇక గుజరాత్ విషయానికొస్తే.. 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 6 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అయితే.. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కాలంటే, జీటీకి ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. మరి.. జీటీ ఆర్సీబీపై విజయం సాధిస్తుందా? లేకపోతే జీటీని ఓడించి ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చల్లుతందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

తుది జట్లు

జీటీ: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, మానవ్‌ సుతార్‌, నూర్ అహ్మద్‌, మోహిత్ శర్మ, జోష్‌ లిటిల్.

ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్‌ సిరాజ్, యశ్ దయాల్‌, విజయ్‌కుమార్ వైశాఖ్.

Updated Date - May 04 , 2024 | 07:17 PM