Share News

సరికొత్త హంగులతో నోకియా!

ABN , Publish Date - May 03 , 2024 | 11:57 PM

నోకియా మోడ్రన్‌ వెర్షన్‌పై హెచ్‌ఎండీఏ(హ్యూమన్‌ మొబైల్‌ డివైజెస్‌) పని చేస్తోందని సమాచారం.

సరికొత్త హంగులతో నోకియా!

నోకియా మోడ్రన్‌ వెర్షన్‌పై హెచ్‌ఎండీఏ(హ్యూమన్‌ మొబైల్‌ డివైజెస్‌) పని చేస్తోందని సమాచారం. ‘నోకియా 3210’ పేరిట రాబోతున్న ఈ మొబైల్‌ ప్రపంచంలోనే మొదటిసారి ఇంటర్నల్‌ ఎంటెన్నాతో ఉండనుంది. మూడు గేమ్స్‌ ఉండనున్నాయి.

నిజానికి ఈ బ్రాండ్‌ ఫోన్‌ 1999లో వచ్చింది. బల్కీ ఫీచర్‌ ఫోన్‌గా ఇంటర్నల్‌ ఎంటెన్నా, టీ9 ప్రిడిక్టివ్‌ టెక్ట్స్‌తో ఉండేది. ప్రస్తుతం వస్తున్న దానిలో 40 వరకు మోనోఫోనిక్‌ రింగ్‌టోన్స్‌ ఉంటాయి.

బ్లాక్‌ అండ్‌ గ్రీన్‌ 1-5 ఇంచీల బ్లాకిట్‌ మోనోక్రోమోటిక్‌ ఎల్‌సీడీ స్ర్కీన్‌ ఉంటుంది. బరువు 150 గ్రాములు కాగా ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ ఫోన్లతో పోల్చుకుంటే తక్కువే. ఇందులో స్నేక్‌, మెమరీ, రొటేషన్‌ అనే గేమ్స్‌ ముందే ఇన్‌స్టాల్‌ అయి ఉంటాయి. కొన్ని వెర్షన్లలో అజ్ఞాతంగా మరికొన్ని గేమ్స్‌ ఉంటాయి.

స్పెషల్‌ సాఫ్ట్‌వేర్‌కు తోడు డేటా కేబుల్‌ ఉపయోగించి వాటిని యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ‘నోకియోమొబ్‌’ ఇటీవలి రిపోర్ట్‌ ప్రకారం ఫినిష్‌ ఔట్‌లెట్‌ ‘జిజాంట్టి’ అనుకోకుండా నోకియా కొత్త వెర్షన్‌ పేరును బైటపెట్టింది. కొత్త ఫోన్‌ సియాన్‌, ఎల్లో రంగుల్లో మే 8నుంచి అందుబాటులోకి రానుంది.

దీని ధర 89 యూరోలు(రమారమి రూ.7,980) ఉంటుందని ఆ నివేదికలో పేర్కొంది. అయితే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉంటుందా అన్నది తెలియలేదు. మైక్రో ఎస్‌డీ కార్డ్‌, బ్లూటూత్‌, 4జీ కనెక్టివిటీ 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీ, యూబీసీ-సీ చార్జింగ్‌ సౌలభ్యం ఉండనున్నాయి.

Updated Date - May 04 , 2024 | 02:10 AM