Share News

ఫోన్‌ఎరీనా నుంచి ‘ఫోన్‌ చరిత్ర’

ABN , Publish Date - May 03 , 2024 | 11:53 PM

దైనందిన జీవితంపై మొబైల్‌ టెక్నాలజీ చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. చేతిలో సెల్‌ లేకుండా కాలుకూడా కదపలేని పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కూడా కాదు.

ఫోన్‌ఎరీనా నుంచి ‘ఫోన్‌ చరిత్ర’

దైనందిన జీవితంపై మొబైల్‌ టెక్నాలజీ చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. చేతిలో సెల్‌ లేకుండా కాలుకూడా కదపలేని పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కూడా కాదు. ఆర్థిక వ్యవస్థలు, పరిశ్రమలు సహా వ్యక్తిగత జీవితం వరకు అంతటా దాని ప్రభావం ఉంది. అటూ ఇటూగా ఇదంతా రెండు దశాబ్దాలకు పైబడిన చరిత్ర.

మొబైల్‌ టెక్నాలజీకి సంబంధించిన సమస్త వివరాలతో ‘ఫోన్‌ ఎరీనా’ తాజాగా ఒక దాచుకోదగ్గ పుస్తకాన్ని(కలెక్టర్స్‌ ఇష్యూ)ని తీసుకువచ్చింది. సెల్‌ ఫోన్‌ హిస్టరీని అందులో నిక్షిప్తం చేసింది. ‘ఐకానిక్‌ ఫోన్స్‌:

రివల్యూషన్‌ ఎట్‌ యువర్‌ ఫింగర్‌టిప్స్‌’ పేరిట ఇది విడుదలైంది. సెల్‌ ఫోన్‌ వివరాలను తెలుసుకోవాలని భావించే ఆసక్తిపరులకు ఇదో మంచి కలెక్టర్స్‌ బుక్‌.

మొబైల్‌ టెక్నాలజీ చరిత్రలోని ప్రతి అడుగును దీన్లో పొందుపరిచింది. రెండు దశాబ్దాల క్రితంతో పోల్చుకుంటే ఫోన్‌ ఇండస్ట్రీ స్వరూప స్వభావాలే మారిపోయాయి. ఈ రంగంలో అత్యుత్తమ సాంకేతికతతో వివిధ ఉత్పత్తులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఉన్నతీకరణ చోటుచేసుకుంటోంది. సరికొత్త ఫీచరతో వచ్చే ఉత్పత్తులు పాతవాటికి గుడ్‌బై చెప్పిస్తున్నాయి.

డయల్‌-అప్‌ ఇంటర్నట్‌ రోజుల నుంచి మొదలుపెడితే సీడీల యుగం ఒక వరసైతే అలాంటివన్నింటినీ తలదన్నేలా మరికొన్ని వచ్చాయి. దాంతో అవన్నీ మూలనపడ్డాయి అనే కంటే మ్యూజియానికి పరిమితమయ్యాయని చెప్పడం వాస్తవ వ్యాఖ్యానమవుతుంది. ఈ క్రమంలో మొదటి ఐఫోన్‌ కూడా ప్రస్తావనార్హం. అదిప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ను తీసే స్థాయికి చేరుకుంది.

మోటోరోలాకు చెందిన ప్రాజెక్ట్‌ సలిక్వా కూడా చర్చనీయాంశమే. చైనీస్‌ ఎంట్రప్రెన్యూర్లు కార్ల్‌ పీ, పెటె లవ్‌ కలిసి 2014లో సృష్టించిన వన్‌ ప్లస్‌ వన్‌ ఏకంగా ఆండ్రాయిడ్‌ యూజర్ల అవసరాలను తీర్చే శక్తిమంతమైన ఫోన్‌గా సెల్‌ చరిత్రకెక్కింది. ఈ ఐకానిక్‌ ఫోన్లే కాకుండా సమస్త చరిత్రను ఈ పుస్తకంలో ఫోన్‌ ఎరీనా పొందుపర్చింది.

Updated Date - May 03 , 2024 | 11:53 PM