Share News

Summer: శరీరంలో ఈ మార్పులు వస్తే వడదెబ్బ తగిలినట్లే.. తస్మాత్ జాగ్రత్త

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:16 AM

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి బయటపెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

Summer: శరీరంలో ఈ మార్పులు వస్తే వడదెబ్బ తగిలినట్లే.. తస్మాత్ జాగ్రత్త

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి బయటపెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కి చెందిన దూరదర్శన్ యాంకర్ ఇటీవలే వడదెబ్బ(Sun Stroke) బారినపడి ఆఫీస్‌లోనే స్పృహ కోల్పోయి పడిపోయారు. ఎండలో పని చేసే వారు వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో వచ్చే మార్పులేంటి, వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

అత్యధిక శరీర ఉష్ణోగ్రత:

శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు చేరుకున్నా, మించినా ఎండదెబ్బ తగిలినట్టు నిర్ధారించుకోవాలి. ఇలా జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.

గుండె వేగం:

శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది.

శ్వాస వేగం:

శరీరం వేడి తగ్గించుకోవడం కోసం త్వరత్వరగా శ్వాస తీసుకోవడం మొదలుపెడుతుంది. శరీరం వేడెక్కినప్పుడు గుండె విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబరిచే ప్రక్రియతో, ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయడం కోసం గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవతుఉంది.

అయోమయం:

ఎండదెబ్బతో మెదడు పనితీరు మీద ప్రభావం పడుతుంది. దాంతో అయోమయం, కళ్లు తిరగడం, కొన్ని సందర్భాల్లో ఫిట్లు కూడా కనిపించవచ్చు. ఎండదెబ్బతో నాడీ వ్యవస్థ ప్రభావితమై, సమన్వయం కోల్పోతాం. దిక్కుతోచని స్థితికి లోనవుతాం. కోపం, నడవలేకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

తలనొప్పి:

తలనొప్పి, తలతిరుగుడు కూడా ఉంటుంది. డీహైడ్రేషన్‌ వల్ల, ఎండదెబ్బతో నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల ఇలా జరగవచ్చు.


వాంతులు:

శరీరం అవసరానికి మించి వేడెక్కడం మూలంగా వాంతులు మొదలవుతాయి.

చర్మం పొడిబారడం:

చర్మం పొడి బారి, వేడెక్కుతుంది. శరీరం ఎంత వేడెక్కినా చమట పట్టదు.

కండరాల నొప్పులు, నిస్సత్తువ:

సహజంగా వేసవిలో వ్యాయామం తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని కూడా సన్‌స్ట్రోక్‌ లక్షణాలుగానే పరిగణించాలి.

మైకం:

చమట ద్వారా శరీరంలోని నీళ్లను కోల్పోయేకొద్దీ డీహైడ్రేషన్‌తో మైకం ఆవరిస్తుంది.

Bulgur: దొడ్డు రవ్వ ఇంత మేలు చేస్తుందా.. తెలిస్తే వదిలిపెట్టరు

వడదెబ్బను ఎలా నివారించాలి..

  • వడదెబ్బకు గురైన సమయంలో ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, తాజా ఉండే రసాలు తీసుకోవాలి.

  • అధిక ఉష్ణోగ్రతలలో వ్యాయామం చేయడం మానుకోండి

  • చల్లటి నీటితో స్నానం చేయండి

  • లేత రంగు, వదులుగా, సౌకర్యవంతమైన బట్టలు ధరించండి

  • ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు బయటకి వెళ్లకుండా ఉండాలి


  • ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తుంది.

  • వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇతర చిట్కాలు:

  • బాగా హైడ్రేటెడ్‌గా ఉండండి

  • వేసవి కాలంలో దొరికే నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు, ఆహార పదార్థాలు తీసుకోవాలి.

  • సన్‌స్క్రీన్ ధరించండి, తేలికైన, పల్చటి దుస్తులను ధరించండి

  • శరీర ఉష్ణోగ్రతను పెంచే చర్యలను నివారించండి

  • శరీరాన్ని కూల్‌గా ఉంచే ఆహారాన్ని తీసుకోండి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 24 , 2024 | 08:23 AM