Share News

బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటా

ABN , Publish Date - May 02 , 2024 | 12:29 AM

బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటా
మచ్చబొల్లారం : మచ్చబొల్లారంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

మచ్చబొల్లారం, మే 1 : బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మచ్చబొల్లారం డివిజన్‌ పరిధిలోని వీబీఆర్‌ గార్డెన్‌లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ఈసారి బీజేపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. మల్కాజిగిరి అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఈటలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్‌, మేడ్చల్‌ జిల్లా ఎస్సీ మోర్చా నాయకుడు మురళి, కరుణాకర్‌, లవ్‌కుమార్‌, నాగరాజు, రమేశ్‌, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

నేను పక్కా లోకల్‌ : ఈటల

ఏఎ్‌సరావునగర్‌ : నేను పక్కా లోకల్‌ అని, ఇక్కడే పుట్టిపెరిగానని ఈటల రాజేందర్‌ అన్నారు. ఏఎ్‌సరావునగర్‌లో బుధవారం ఫోరం ఫర్‌ ఇంప్రూవింగ్‌ థింగ్స్‌(ఎ్‌ఫఐటి)ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్‌ నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ మోదీకి ముచ్చటగా మూడోసారి ఓటు వేయాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలిపారు. దేశంలో గతంలో ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలే ఉండేవని, గత పదేళ్ల నుంచి స్థిరమైన ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రధాని మోదీ వ్యక్తి కాదని ఒక శక్తి అని పేర్కొన్నారు. దేశంలో రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయని ఈటల తెలిపారు. లోక్‌సత్తా నాయకుడు జయప్రకా్‌షనారాయణ వంటి వారు ప్రధాని మోదీని బలపరచడం అభినందనీయమన్నారు. అచ్చమైన తెలంగాణ బిడ్డనైన నన్ను ఇతర పార్టీల వారు ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నిస్తున్నారని నేను పక్కా లోకల్‌ అని తెలిపారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ఈటల కోరారు. సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజేందర్‌ను మెజారిటీతో గెలిపించాలి

రామంతాపూర్‌/నిజాంపేట్‌/షాపూర్‌నగర్‌/మౌలాలి/మేడ్చల్‌ : ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కోరుతూ రామంతాపూర్‌ డివిజన్‌ పరిధిలోని 254, 255, 256 బూత్‌ల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు రేవు నర్సింహ కురుమ, బుర్ర రాజేశ్వర్‌, బొడ్డుపల్లి ఆనంద్‌, గుండె భిక్షపతిల ఆధ్వర్యంలో పాత రామంతాపూర్‌లో కార్పొరేటర్‌ బండారు శ్రీవాణి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ దేశంలో నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి ఓటర్లకు వివరించి ఈటలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే హబ్సిగూడ డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈటలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. అలాగే నిజాంపేట్‌ కార్పొరేషన్‌లోని మధురానగర్‌, బాచుపల్లి కౌసల్య కాలనీల నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, కాపు సంఘ నాయకులు బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్‌, బీజేపీ నాయకులు చక్రధర్‌ల ఆధ్వర్యంలో ఈటల సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే ఈటల రాజేందర్‌ సూరారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్‌లోని సంజయ్‌గాంధీనగర్‌, శ్రీకృష్ణనగర్‌, మార్కేండేయనగర్‌, నెహ్రూ నగర్‌లోను ప్రచారం చేశారు. గాజులరామారం డివిజన్‌లోని ఉషోదయ కాలనీ కమ్యూనిటీ హాల్లో బీజేపీ నాయకులతో కలిసి ఈటల సమావేశమయ్యారు. పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. కాగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు ఓటు వేసి వృథా చేయవద్దని ఈటల సూచించారు. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని మల్కాజిగిరి, వినాయకనగర్‌, మౌలాలి డివిజన్‌లలోని కేశవ్‌నగర్‌ నుంచి వినాయకనగర్‌ చౌరస్తా మీదుగా సంతో్‌షమాతనగర్‌ చౌరస్తా నుంచి ఓల్డ్‌ సఫీల్‌గూడ వరకు రోడ్‌షో నిర్వహించారు. కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటల సమక్షంలో మేడ్చల్‌ మండలం సోమారానికి చెందిన పలువురు బీజేపీలో చేరారు. నారెడ్డి నందారెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజాహరినాథ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు పార్టీలో చేరారు.

Updated Date - May 02 , 2024 | 12:29 AM