Share News

ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు

ABN , Publish Date - May 02 , 2024 | 12:43 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తుందని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మండలలో నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు
శంకర్‌పల్లి : ప్రచారంలో మాట్లాడుతున్న రంజిత్‌రెడ్డి

చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి

శంకర్‌పల్లి, మే 1: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తుందని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మండలలో నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ విశ్వేశ్వర్‌రెడ్డి ఐదేళ్లకోసారి ఎన్నికల్లో విహారయాత్రకు వస్తూ పోతుంటారని, తర్వాత ప్రజలను పట్టించుకోరని అన్నారు. తాను ఎంపీగా ఐదేళ్లు చేవెళ్ల పరిధిలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారన్నారు. తనపై విశ్వేశ్వర్‌రెడ్డి యేసిన ఆరోపణలు సత్యదూరం అన్నారు. అంతకుముందు వివిధ పార్టీల నాయకులు పలువురు కాంగ్రె్‌సలో చేశారు. చేవెళ్ల ఇన్‌చార్జి భీంభరత్‌, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు సత్యనారాయణరెడ్డి, పీసీసీ కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలి

చేవెళ్ల/షాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌/మహేశ్వరం/కందుకూరు/రాజేంద్రనగర్‌/ఎల్‌బీనగర్‌/హైదర్‌నగర్‌: చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చేవెళ్ల మండలం కందవాడకు చెందిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శేరి పెంటారెడ్డి, రంజిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. షాబాద్‌ మండల బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రవీందర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. మండల బీఆర్‌ఎస్‌ నాయకుడు, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి 50మందితో కలిసి రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మహేశ్వరాన్ని కాంగ్రె్‌సకు అడ్డాగా మార్చి పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి నేరెళ్ల శారద అన్నారు. తుమ్మలూరు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వారి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. పీసీసీ సభ్యులు ఏనుగు జంగారెడ్డి కందుకూరు మండలం మీర్కాన్‌పేట, ఆకులమైలారంలో, బొక్క జంగారెడ్డి బేగంపేటలో ప్రచారం చేశారు. రంజిత్‌రెడ్డిసతీమణి సీతారెడ్డి కోరారు. మే డేను పురస్కరించుకుని కాటేదాన్‌ టీఎల్‌ఎం గార్డెన్‌లో ఏఐటీయూసీ నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అలాగే సీతా రంజిత్‌రెడ్డి సరూర్‌నగర్‌ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. భగత్‌సింగ్‌నగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి గడపగడపకు వెళ్లి కాంగ్రెస్‌ హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

తాండూరు అభివృద్ధి బాధ్యత నాది

తాండూరు రూరల్‌/బషీరాబాద్‌/ధారూరు/పెద్దేముల్‌/బంట్వారం/కులకచర్ల/మర్పల్లి/వికారాబాద్‌/నవాబుపేట/యాలాల : తాండూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా గెలిచానని, తాండూరు అభివృద్ధి బాధ్యత తనదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. తాండూరు మండలం దస్తగిరిపేట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంజిత్‌రెడ్డి గెలుపు కోసం చేతిగుర్తుపై ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అన్నారు. బషీరాబాద్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పేదల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. మైల్వార్‌లో 200 మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. సోంపల్లి బిచ్చిరెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి, ఽశంకర్‌రెడ్డి సత్తార్‌ పాల్గొన్నారు. ధారూరు కాంగ్రెస్‌ నాయకులు ఉపాధి కూలీలను కలిసి చేతి గుర్తుకు ఓటేసి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బుజ్జయ్యగౌడ్‌, బాబాఖాన్‌, కిరణ్‌కుమార్‌, ముజాఫర్‌, అంజయ్య, రవీందర్‌, దావూద్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ నెల 6న వికారాబాద్‌లోని గౌలికార్‌ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించే మైనార్టీల సమావేశానికి ముస్లింలు తరలిరావాలని కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆయ్యూబ్‌ అన్సారీ తెలిపారు. మండల గ్రామాల్లో పర్యటించి ముస్లింలతో సమావేశమయ్యారు. పెద్దేముల్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. జడ్పీటీసీ ధారాసింగ్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, డీవై.నర్సిములు పెద్దేముల్‌ పెద్దచెరువు వద్ద కూలీలతో మాట్లాడి చేతిగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతొక్కరూ కాంగ్రెస్‌కే ఓటువేయాలని బంట్వారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోచారం వెంకటేశం అన్నారు. యాచారంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హరీశ్వర్‌రెడ్డి, యాదగిరి, వెంకటయ్య, తౌఫీక్‌పాషా, హర్షవర్ధన్‌రెడ్డి, అజీం, శ్రీనివాస్‌, ఇసాక్‌, వెంకటేశం, శంకర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్ఛంద్ర అన్నారు. ముజాహిద్‌పూర్‌లో ఉపాధి కూలీలతో మాట్లాడారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఖాయమని మర్పల్లి కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. పట్టణంలో ప్రచారం నిర్వహించారు. వికారాబాద్‌ ప్రాంత అభివృద్ధికి వేల కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మామీ ఇచ్చారని వికారాబాద్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. మద్గుల్‌ చిట్టంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. రంజిత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముత్తహర్‌షరీప్‌, మల్లయ్య పాల్గొన్నారు. నవాబుపేట మండలం చించల్‌పేట్‌ మాజీ సర్పంచ్‌ కాలె శ్రీనివాస్‌, మరి కొందరు రంజిత్‌రెడ్డి, భీం భరత్‌ల సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ ఎక్బాల్‌, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కొండల్‌యాదవ్‌, ఉపేందర్‌రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీధర్‌, సంగారెడ్డి పాల్గొన్నారు. 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని యాలాల మండలం అన్నాసాగర్‌కు కాంగ్రెస్‌ నాయకుడు సత్యనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - May 02 , 2024 | 12:43 AM