Share News

ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యం

ABN , Publish Date - May 02 , 2024 | 12:28 AM

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందని. ప్రజలు కేసీఆర్‌ను నమ్మడం లేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు.

ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యం
తాండూరు : సమావేశంలో మాట్లాడుతున్న విశ్వేశ్వర్‌రెడ్డి

తాండూరురూరల్‌, మే 1 : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందని. ప్రజలు కేసీఆర్‌ను నమ్మడం లేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. బుధవారం తాండూరు మండలం గోనూరు ఎంపీటీసీ నర్సమ్మ, మాజీ సర్పంచ్‌ గోవింద్‌లు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి విశ్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీలో చేరారు. అదేవిధంగా గోనూరు, వీర్‌శెట్టిపల్లికి చెందిన ఎర్ర శ్రీనివాస్‌, రాజు, భీంరెడ్డి, రాంరెడ్డి, నర్సింహా, పరుశురాం, ఎర్ర శ్రీశైలం, చీమల హరి, శంకర్‌, మల్లప్ప, మల్లేశం, బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమే్‌షకుమార్‌, గౌతాపూర్‌ ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, నాయకులు బొప్పి శ్రీహరి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిక

మండల పరిధిలోని చంద్రవంచ గ్రామంలో కాంగ్రె్‌సకు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డితోపాటు కొంతమంది యువకులు బీజేపీలో చేరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాగా, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోవడం లేదని విజయ్‌కుమార్‌ ఆరోపించారు.

మేడే వేడుకల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తాండూరు : తాండూరు మార్కెట్‌లో నిర్వహించిన ప్రపంచ కార్మిక దిన వేడుకల్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడుతూ మేడే వేడుకలను కార్మికుల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మార్కెట్‌లోని వర్తక సంఘం, హమాలీ సంఘం సభ్యులతో ముచ్చటించారు. కార్మికుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. త్వరలో ప్రపంచ ఆర్థిక రంగంలో భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానాన్ని ఆక్రమిస్తుందని కొండా ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తాండూరులో జరిగిన వీరశైవ సమాజ్‌ ఆత్మీయ సమ్మేళనంలో విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. బసవేశ్వరుడు సమాజంలోని అంతరాలను ప్రశ్నించిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గం.. నడవడిక మేటి నాయకులకు మార్గదర్శకమని తెలిపారు. ఆయన ఆదర్శంగా తీసుకొని సమాజంలో మార్పుకోసం ప్రతి ఒక్కరు సేవా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. వీరశైవ సమాజ్‌ అధ్యక్షుడు బస్వరాజ్‌ ఆధ్వర్యంలో 200 మంది సభ్యులు బీజేపీలో చేరారు.

విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపుతో అభివృద్ధి సాధ్యం

మోమిన్‌పేట్‌/ధారూరు/మర్పల్లి/వికారాబాద్‌/కులకచర్ల/బషీరాబాద్‌ : విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపుతో తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆ పార్టీ మోమిన్‌పేట మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు ఆశిరెడ్డి అన్నారు. గోవిందపూర్‌, చక్రంపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ధారూరులోని వివిధ కాలనీల్లో నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీకి ఓటు వేసేందుకు ప్రజలు పూర్తి విశ్వాసంతో మద్దతు తెలుపుతున్నారని జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. మర్పల్లి మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీకి ఓటువేసి గెలిపించాలని బీజేపీ జిల్లా నాయకులు రాజేందర్‌ రెడ్డి, బుస్సా శ్రీకాంత్‌ అన్నారు. వికారాబాద్‌ పట్టణంలోని ఇందిరానగర్‌, అంబేడ్కర్‌ కాలనీల్లో ప్రచారం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పాల్గొన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా బీజేపీ నాయకులు కులకచర్లలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. బషీరాబాద్‌ మండలం జీవన్గి, బద్లాపూర్‌, బద్లాపూర్‌తండాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల నుంచి పలువురు యువకులు, నాయకులు, కార్యకర్తలు తాండూరులో విశ్వేశ్వర్‌రెడ్డి సమక్ష్యంలో దాదాపు 50 మంది బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పరి రామే్‌షకుమార్‌, జిల్లా కార్యదర్శి గంగాధర్‌, సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎంపీగా కొండాను గెలిపించాలి

మహేశ్వరం/మొయినాబాద్‌ రూరల్‌/చేవెళ్ల/షాబాద్‌ : తుక్కుగూడ ప్రజలు చేవెళ్ల ఎంపీగా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తుక్కుగూడ మున్సిపల్‌ బీజేపీ అద్యక్షుడు రచ్చ లక్ష్మణ్‌ కోరారు. మున్సిపల్‌ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాగా, మోదీ పాలనలో మచ్చుకైనా అవినీతి లేదని భూతద్దం, మైక్రోస్కోప్‌ పెట్టి చూసినా ఎవరూ ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్‌ నాయకులపై బీజేపీ రంగారెడ్డి జిల్లా సీనియర్‌ నాయకులు గున్నాల గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం హిమాయత్‌ నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ వాళ్లు, కుల రిజర్వేషన్‌ రద్దు నినాదం ఎత్తుకున్నారని, బీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంత నినాదం ఎత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేవెళ్ల మండలాధ్యక్షుడు పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డిలు మండలంలోని అల్లావాడ, జలాగూడలో విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. దేశ ప్రగతి మోదీతోనే సాద్యమౌతుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. షాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడ, నరేడ్లగూడ, దామర్లపల్లి, నాందార్‌ఖాన్‌పేట్‌ గ్రామాల్లో బీజేవైఎం స్వచ్చభారత్‌ సెల్‌ రాష్ట్ర కన్వినర్‌ రాము, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కూతురు మహేందర్‌, బీజేవైఎం మండలాధ్యక్షుడు మహే్‌షలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

Updated Date - May 02 , 2024 | 12:28 AM