Share News

వేడి నీరు పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - May 17 , 2024 | 12:42 AM

గీజర్‌లోని అధిక వేడినీళ్లు ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వనస్థలిపురానికి చెందిన లేఖ్య రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలో గల ఇక్ఫాయ్‌ వర్సిటీ కాలేజీలో బీబీఏ(ఎల్‌ఎల్‌బీ) తృతీయ సంతవ్సరం చదువుతోంది.

వేడి నీరు పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు

గీజర్‌ ఆన్‌ చేయగా ప్రమాదం

చికిత్స పొందుతున్న ఇక్ఫాయ్‌ విద్యార్థిని

శంకర్‌పల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): గీజర్‌లోని అధిక వేడినీళ్లు ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వనస్థలిపురానికి చెందిన లేఖ్య రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలో గల ఇక్ఫాయ్‌ వర్సిటీ కాలేజీలో బీబీఏ(ఎల్‌ఎల్‌బీ) తృతీయ సంతవ్సరం చదువుతోంది. విద్యార్థిని బుధవారం రాత్రి 7:30సమయంలో స్నానం చేసేందుకని వాష్‌ రూంలోకి వెళ్లి గీజర్‌లోని నీటికి ఒంటిపై పోసుకుంది. అప్పటికే నీరు ఎక్కువ వేడి ఉండడంతో విద్యార్థిని ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. బాధ తట్టుకోలేక అరవడంతో తోటి విద్యార్థినులు చేరుకున్నారు. వెంటనే యాజమాన్యానికి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. లేఖ్యను కాలేజీ యాజమాన్యం గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించింది. అక్కడి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌లో గల ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లేఖ్య చికిత్స పొందుతోంది. గురువారం విషయం తెలుసుకున్న నార్సింగ్‌ ఏసీపీ రమనాగౌడ్‌, ఇన్‌స్పెక్టర్‌ వీర బాబు, ఎస్‌ఐ కోటేశ్వరరావులు కళాశాలకు చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. తోటి విద్యార్థినులతో, కళాశాల యాజమాన్యంతో మాట్లాడి వివరాలు సేకరించారు. మోకిల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినిపై దాడి జరిగిందంటూ సోషల్‌ మీడియాలో సర్క్యులేటవుతున్న వార్తలు అసత్యం అని నార్సింగ్‌ ఏసీపీ రమణాగౌడ్‌ ఖండించారు.

Updated Date - May 17 , 2024 | 09:26 AM