Share News

TG: బీజేపీ చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది

ABN , Publish Date - May 02 , 2024 | 05:27 AM

రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్న బీజేపీ.. అసలు రిజర్వేషన్లను ఏ విధంగా వర్గీకరిస్తుంద ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ప్రశ్నించారు.

TG: బీజేపీ చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది

  • ఢిల్లీ పోలీసుల నోటీసుపై 5 రోజుల గడువు కోరాం

  • సీఆర్‌పీసీ 41 నోటీసులిచ్చి భయపెడుతున్నారు

  • టీపీసీసీ లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జ్‌ రాంచంద్రారెడ్డి

  • బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు దళిత వ్యతిరేక పార్టీలు

  • ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ సంపత్‌కుమార్‌

  • రిజర్వేషన్ల రద్దు యత్నాలను నిరసిస్తూ 4న ధర్నా

హైదరాబాద్‌, మే1 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్న బీజేపీ.. అసలు రిజర్వేషన్లను ఏ విధంగా వర్గీకరిస్తుంద ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ప్రశ్నించారు. దళితులు ముఖ్యంగా మాదిగలు ఇప్పుడు మెరుగైన స్థాయిలో ఉండడానికి కాంగ్రెస్‌ పార్టీ అందించిన అనేక సంక్షేమ ఫలాలే కారణమని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో పలువురు దళిత నాయకులు సమావేశమయ్యారు.


అనంతరం సంపత్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో కొనసాగిన బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు వర్గీకరణపై ఒక్క అడుగు ముందుకు వేయలేదని, ఈ రెండూ దళిత వ్యతిరేక ప్రభుత్వాలని విమర్శించారు. మాదిగల వర్గీకరణకు కట్టుబడి ఉన్న రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో అండగా నిలబడాలని కోరారు. రిజర్వేషన్ల రద్దు యత్నాలను నిరసిస్తూ మే 4న పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్టు మాజీ మంత్రి చంద్రశేఖర్‌, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మధ్య జరుగుతున్న యుద్థమని ఎస్సీ సెల్‌ నాయకుడు గజ్జల కాంతం వ్యాఖ్యానించారు. .

Updated Date - May 02 , 2024 | 05:27 AM