ప్రజ్ఞానంద ఓటమి
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:13 AM
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానందకు చుక్కెదురైంది. 11వ రౌండ్లో నకమురా (అమెరికా) చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు...
క్యాండిడేట్స్ చెస్
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానందకు చుక్కెదురైంది. 11వ రౌండ్లో నకమురా (అమెరికా) చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో ప్రత్యర్థికి తలవంచాడు. కాగా, కరువానా (అమెరికా)తో గుకేష్ పాయింట్ పంచుకొన్నాడు. తెల్లపావులతో ఆడిన గుకేష్ 40 ఎత్తుల అనంతరం కరువానాతో డ్రాకు అంగీకరించాడు. రష్యన్ జీఎం ఇయాన్ నెపోమ్నియాచి చేతిలో విదిత్ గుజరాతీ కంగుతిన్నాడు. మొత్తంగా 11 రౌండ్ల నుంచి గుకేష్ 6.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ప్రజ్ఞానంద (5.5), గుజరాతీ (5) ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో సలీమోవా (బల్గేరియా)పై హంపి, జీఎం అలెగ్జాండ్రా గోర్యెంచ్కినా (రష్యా)పై ఐఎం వైశాలి గెలిచారు.