Share News

ఇంపాక్ట్‌ రూల్‌ నచ్చలేదు

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:14 AM

గతేడాది నుంచి ఐపీఎల్‌లో అమలవుతున్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఆల్‌రౌండర్ల పురోగతికి ఆటంకంగా...

ఇంపాక్ట్‌ రూల్‌ నచ్చలేదు

న్యూఢిల్లీ: గతేడాది నుంచి ఐపీఎల్‌లో అమలవుతున్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఆల్‌రౌండర్ల పురోగతికి ఆటంకంగా ఉందని స్పష్టం చేశాడు. ‘క్రికెట్‌ అనేది 11 మందితోనే ఆడాలి. 12 మందితో కాదు. నాకు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన నచ్చలేదు. ఇది ఆల్‌రౌండర్ల నైపుణ్యాలను తగ్గించేస్తుంది. ప్రేక్షకులకు మరింత మజాను అందించేందుకు దీన్ని ప్రయోగిస్తున్నారు. కానీ క్రికెట్‌ కోణంలో చూసుకుంటే దూబే, సుందర్‌లాంటి ఆల్‌రౌండర్లు బౌలింగ్‌కు దూరమవుతున్నారు. వారిని బ్యాటింగ్‌కు ఉపయోగించుకుని ఆ తర్వాత పెవిలియన్‌కు పరిమితం చేస్తున్నారు. ఇది భారత క్రికెట్‌కు మంచిది కాదు’ అని ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో రోహిత్‌ తెలిపాడు.

Updated Date - Apr 19 , 2024 | 02:14 AM