Share News

CSK vs PBKS: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న పంజాబ్ కింగ్స్

ABN , Publish Date - May 01 , 2024 | 07:16 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. పంజాబ్ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్‌లో ఈ ఇరు జట్లు తలపడుతుండటం...

CSK vs PBKS: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న పంజాబ్ కింగ్స్

ఐపీఎల్-2024లో భాగంగా.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. పంజాబ్ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్‌లో ఈ ఇరు జట్లు తలపడుతుండటం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ మొత్తం ఐపీఎల్‌లో చెన్నై, పంజాబ్‌ మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. వీటిల్లో సీఎస్కే 15 మ్యాచ్‌ల్లో, పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. అయితే.. చెపాక్ స్టేడియంలో మాత్రం పంజాబ్ మూడింట్లో గెలిచింది. దీంతో.. పంజాబ్‌పై సీఎస్కే ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని సీఎస్కే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

క్యాన్సర్ పేషెంట్‌కి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల కోట్లు

మరోవైపు.. ప్లే-ఆఫ్స్‌లో చోటు సంపాదించాలంటే, పంజాబ్ జట్టు ఇకపై వరుస విజయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. 3 విజయాలు మాత్రమే నమోదు చేసి, 6 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంజాబ్ టాప్-4లో చోటు దక్కించుకోవాలంటే.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు 16 పాయింట్లు దక్కుతాయి కాబట్టి, టాప్-4లో ఉండే ఛాన్స్ దక్కుతుంది. అందుకే.. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది ‘డూ ఆర్ డై’ లాంటిది కాబట్టి.. పక్కాగా గెలవాల్సిందేనని పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

Updated Date - May 01 , 2024 | 07:16 PM