Share News

ప్రజల తెలివి!

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:24 AM

అక్బర్‌ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఆయన దగ్గర ఉండే సలహాదారులు, మంత్రులూ కూడా గొప్పవారు. ఇక బీర్బల్‌ హాస్యచతుర్యత, సమస్యను పరిష్కరించే విధానం అద్భుతం.

ప్రజల తెలివి!

అక్బర్‌ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఆయన దగ్గర ఉండే సలహాదారులు, మంత్రులూ కూడా గొప్పవారు. ఇక బీర్బల్‌ హాస్యచతుర్యత, సమస్యను పరిష్కరించే విధానం అద్భుతం. తన ప్రజలు బావున్నారని ఎప్పుడూ చెప్పేవాడు. అలా ఎప్పుడూ తనకు తాను చెప్పుకుండేవాడు. ఒక రోజు అక్బర్‌, బీర్బల్‌ ఇద్దరూ గడ్డిమీద నడుస్తున్నారు. అప్రయత్నంగా ‘ఈ ప్రజలెంత మంచి వాళ్లు. నా రాజ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు’ కదా అన్నాడు. వెంటనే బీర్బల్‌ ఇలా అన్నాడు.. ‘రాజావారు మీ రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉన్నారు. అయితే మీరు అనుకున్నంత మంచివాళ్లు ప్రజలు కారు’ అన్నారు. ఈ మాటతో నేను నీ మాటలతో ఏకీభవించలేను., ఏకీభవించను కూడా అన్నారు. బీర్బల్‌ నవ్వి ఊరుకున్నాడు. నేను ఓ విషయం చెప్పాలి. ‘జనాలను చూస్తేనే కదా.. వారు ఎలా ఉండేది తెలిసేది’ అన్నాడు.

ఒక రోజు అక్బర్‌తో రహస్యంగా మాట్లాడాడు బీర్బల్‌. అక్బర్‌, బీర్బల్‌తో పాటు సైన్యం ఓ పెద్ద గ్రామానికి వెళ్లింది. అక్కడ ఉండే దారులు, మురికి నీళ్లు పోవటానికి కాలువలు లేవని గుర్తించారు.

పేదవారు తమ ఇంటి ముందు స్థలం రహదారి పనుల నిమిత్తం పోయినా.. భయపడాల్సిన పనిలేదని రాజుగారు సెలవిచ్చారు. అధికారులు ఆ తర్వాత రోజువెళ్లి ఆ పనుల గురించి ఆరా తీశారు. పని తెలిసిన వాళ్లు వచ్చారు. రహదారికి ఎంత పోతుంది.. ఇంటి స్థలం ఎంత ప్రభుత్వం పాలవుతుందని చెప్పారు.

ఆ తర్వాతనే నష్టపరిహారం కట్టించారు. కూలీలు ఆ తర్వాత వచ్చి పనులు సాగించారు. ‘మా ఇల్లు చాలా పెద్దది. మా ఇంటి ముందు స్థలం పోయింది. మా చేను చిన్నదయిపోయింది’ లాంటి మాటలు మాట్లాడుతూ జనం రాజుగారి దగ్గరకు వచ్చారు. ‘ఆ పనులు చేశారు. మంచిదే.

మా జాగా ధర ఎక్కువ. అయితే తమరు తక్కువ డబ్బులు ఇచ్చారు’ అంటూ మొరపెట్టుకున్నారు. వెంటనే ‘నష్టపరిహారం పెంచండి మహాప్రభూ’ అంటూ వేడుకున్నారు. పేదవాళ్లు కదా.. అందునా నా దేశ ప్రజలు.. మీరు ఇలా అడగకూడదు. మీకు హక్కు ఉందంటూ అక్బర్‌ హుకుం జారీ చేశారు అధికారులకు. వాళ్లు వచ్చి పేదలను సంతోషపరిచేట్లు డబ్బు ఎక్కువనే ముట్టచెప్పారు.


ఆ తర్వాత బీర్బల్‌ మరో ప్రణాళిక వేశారు. దాన్ని రాజుగారు చెప్పారు. ఈ సారి అక్బర్‌ అక్కడకు వెళ్లలేదు. అదే గ్రామంలో ‘భూమి పన్నులు పెంచుతున్నాం. ఇంతకుముందు కంటే ఎక్కువ సవరిస్తాం’ అని దండోరా వేయించారు.

జనాలు ఒకటే గుంపు. అందరూ సన్నద్ధంగా ఉండాల్సిందే. రాజుగారి మాట కదా! అంటూ గర్వంగా పొంగిపోయాడు అక్బర్‌. ఆ మరుసటి రోజు రాజ్యంలోకి విపరీతంగా జనాలు వచ్చారు.

అయ్యా.. మాకు ఏమీ లేదని వచ్చారు. ‘ఒకప్పుడు డబ్బులకోసం ఆస్తి ఎక్కువ ఉందని చూపించిన వాళ్లే ఇలా మాకు ఆస్తి తక్కువ ఉంది అని’ చెప్పటం హాస్యంగా అనిపించింది అక్బర్‌కు.

వామ్మో ఈ జనాలు తెలివైనవాళ్లే అనుకున్నారు. అప్పుడు అర్థం అయింది అక్బర్‌కు. ‘కేవలం జనాలు రాజుగారి మాటలు వింటారు. ఎవరూ కట్టుబడి పని చేయరు.

ఎవరు ఏమి చేయాలనుకుంటే అదే చేస్తారు. మనం ఎవరినీ మార్చలేం. ప్రజలేమీ అమాయకులు కాదు’ అంటూ బీర్బల్‌కే చెప్పారు అక్బర్‌. ‘నేను చెబితే విన్నారా? జహాపనా. విషయం తెలుసుకున్నారు సంతోషం’ అన్నారు. అక్బర్‌కు తెలివి వచ్చింది.

Updated Date - Apr 30 , 2024 | 01:24 AM