Share News

పొట్ట చల్లగా...

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:11 AM

వేసవిలో వేడి వేడిగా తినాలని అనిపించదు. శరీరాన్ని చల్లబరిచే చలచల్లని పదార్థాల వైపు మనసు లాగుతూ ఉంటుంది

పొట్ట చల్లగా...

వేసవిలో వేడి వేడిగా తినాలని అనిపించదు. శరీరాన్ని చల్లబరిచే చలచల్లని పదార్థాల వైపు మనసు లాగుతూ ఉంటుంది. అయితే ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్‌లు లాంటి వాటితో ఒంటిని చల్లబరుచుకోడానికి బదులుగా, బ్రేక్‌ఫా్‌స్ట(Breakfast)లో పులిసిన పెరుగన్నం ట్రై చేయాలి.

రాత్రి మిగిలిపోయిన అన్నం పారేయకుండా ఒక మట్టి పాత్రలో వేసి, గోరువెచ్చని పాలు, చెంచా పెరుగు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ఉదయానికి చక్కగా గడ్డకట్టి కమ్మని పెరుగన్నం తయారవుతుంది. దీన్లో ఉప్పు కలుపుకుని నేరుగా తినొచ్చు.

లేదంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకులతో తాలింపు వేసుకుని తినొచ్చు. ఈ పెరుగన్నం ఎండ వేడి నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణాశయానికి శక్తినిచ్చి, జీర్ణశక్తిని (Digestive power)పెంచుతుంది. తేలికగా అరుగుతుంది కాబట్టి పెద్దలు కూడా నిస్సంకోచంగా తినొచ్చు.

Updated Date - Apr 30 , 2024 | 01:11 AM