Share News

శరీరం గట్టిగా..

ABN , Publish Date - May 01 , 2024 | 01:23 AM

ఎండాకాలం అనగానే పుచ్చకాయలు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పుచ్చకాయలు ఉన్నాయి. శరీరానికి చల్లదనం కూడా చేకూర్చే ఈ సమ్మర్‌ ఫ్రూట్‌ ఉపయోగాలివే..

శరీరం గట్టిగా..

ఎండాకాలం అనగానే పుచ్చకాయలు గుర్తొస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పుచ్చకాయలు ఉన్నాయి.

శరీరానికి చల్లదనం కూడా చేకూర్చే ఈ సమ్మర్‌ ఫ్రూట్‌

ఉపయోగాలివే..

  • వాటర్‌మెలన్‌లో 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడుతుంది.

  • ఇందులో ఫైబర్‌ ఉండటం వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. దీంతో పాటు బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ పండును మెనూలో ఉంచుకోవాల్సిందే.

  • విటమిన్‌- సి పుష్కలం. దీనివల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

  • ఎ- విటమిన్‌ ఉండటం వల్ల శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది. పొటాషియం ఉండటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. త్వరగా నీరసం రాదు. గుండె ఆరోగ్యానికి మంచిది.

  • రక్తంలోని చక్కెరశాతం పెరగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బ బారిన నుంచి పుచ్చకాయ పండు రక్షిస్తుంది.

  • మలబద్ధకంతో బాధపడేవాళ్లు, మూత్రం మంటగా వస్తున్నప్పుడు.. ఈ పుచ్చకాయ పండు లేదా రసం తాగితే ఉపశమనం లభిస్తుంది. బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది.

Updated Date - May 01 , 2024 | 01:23 AM