Share News

అవి తినడం ప్రమాదకరమా?

ABN , Publish Date - May 02 , 2024 | 05:55 AM

- ఓ సోదరి, హైదరాబాద్‌. ప్రయోగశాలలో శ్యాంపిల్స్‌ నిల్వకు, ఐస్‌క్రీమ్స్‌ తయారీలో ఫ్రీజింగ్‌ ఏజెంట్స్‌గా, ప్రిజర్వేటివ్స్‌గా, ఇతరత్రా వైద్య, వినోద అవసరాలకు లిక్విడ్‌ నైట్రోజన్‌, డ్రై ఐస్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని అత్యంత తక్కువ తాపమానాలకు గురి చేయవచ్చు.

అవి తినడం ప్రమాదకరమా?

డాక్టర్‌! డ్రై ఐస్‌, లిక్విడ్‌ నైట్రోజన్‌లను ఉపయోగిస్తూ, ఆహార పదార్థాలకు ఆకర్షణ తెచ్చిపెడుతున్న సందర్భాలను చూస్తున్నాం. ఈ పదార్థాలు హానికరమనే వార్తలు వెలువడుతున్నాయి. ఇది ఎంతవరకూ నిజం?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

ప్రయోగశాలలో శ్యాంపిల్స్‌ నిల్వకు, ఐస్‌క్రీమ్స్‌ తయారీలో ఫ్రీజింగ్‌ ఏజెంట్స్‌గా, ప్రిజర్వేటివ్స్‌గా, ఇతరత్రా వైద్య, వినోద అవసరాలకు లిక్విడ్‌ నైట్రోజన్‌, డ్రై ఐస్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని అత్యంత తక్కువ తాపమానాలకు గురి చేయవచ్చు.

డ్రై ఐస్‌ - 78.5 డిగ్రీలకూ, లిక్విడ్‌ నైట్రోజన్‌ - 196 డిగ్రీలకూ చల్లబడతాయి. వీటిని గది ఉష్ణోగ్రతకు బహిర్గతం చేసినప్పుడు తెల్లని పొగలు వెలువడతాయి. దాంతో వీటిని వినోదాల్లో వేడుకల్లో వినియోగిస్తూ ఉంటారు. కానీ అత్యంత కనిష్ఠ తాపమానాలను కలిగి ఉండే వీటిని తినడం ప్రమాదకరం. ఇవి శరీరానికి తగిలినప్పుడు కణజాల నష్టం, చర్మం కాలిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి డ్రై ఐస్‌ లేదా లిక్విడ్‌ నైట్రోజన్‌లతో కలిపి అందించే పదార్థాలకు దూరంగా ఉండాలి. పొగ రూపంలో వెలువడే లిక్విడ్‌ నైట్రోజన్‌ను పీల్చడం కూడా ప్రమాదకరమే! ఉబ్బసం లాంటి శ్వాసకోశ సమస్యలున్న వారికి ఇది రెట్టింపు ప్రమాదకరం.

డాక్టర్‌ రమాకాంత్‌

జనరల్‌ ఫిజీషియన్‌, హైదరాబాద్‌

Updated Date - May 02 , 2024 | 05:56 AM