Share News

NAVYA: అమెజాన్‌ అలెక్సా అమేజింగ్‌ ఫీచర్స్‌

ABN , Publish Date - May 11 , 2024 | 02:43 AM

అలెక్సా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్లు అందరికీ అవగాహన లేకపోవచ్చు. ఇవి మరింత ప్రయోజనకరంగా ఉన్నాయి

NAVYA: అమెజాన్‌ అలెక్సా అమేజింగ్‌ ఫీచర్స్‌

అలెక్సా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్లు అందరికీ అవగాహన లేకపోవచ్చు. ఇవి మరింత ప్రయోజనకరంగా ఉన్నాయి.

  • యాంబియెంట్‌ ధ్వనులు లేదా ఇంటరాక్టివ్‌ గేమ్స్‌తో పెంపుడు జంతువులను ఉల్లాసంగా ఉంచుతుంది. యజమానులు ఇంట్లో లేనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

  • ప్రత్యేక పరిస్థితులు, ప్రశ్నలు తలెత్తినప్పుడు అలెక్సా రెస్పాన్స్‌ బాగా ఉంటుంది. అందుకు అనుగుణంగా స్కిల్‌ బ్లూప్రింట్స్‌ను ఉపయోగించుకోవాలి. వాటిని పర్సనలైజ్‌ చేసుకోవాలి.

  • అలెక్సాకు చెందిన టాస్క్‌ మేనేజ్‌మెంట్‌ సహకారంతో ఈమెయిల్‌, క్యాలెండర్‌ను ఇంటిగ్రేట్‌ చేసుకోవచ్చు.

  • గార్డ్‌ మోడ్‌ని యాక్టివేట్‌ చేసుకోవాలి. అప్పుడు అలార్మింగ్‌ సౌండ్స్‌, అలెర్టులు అవసరాలకు అనుగుణంగా అలెక్సా వింటుంది.

  • పలు అలెక్సా డివైజ్‌లు ఉన్నప్పుడు వేర్వేరు రూముల్లో ఉన్నప్పటికీ మ్యూజిక్‌ను స్ట్రీమ్‌లైన్‌ చేసుకోవచ్చు.

  • ఎంపిక చేసిన సంస్థలకు అలెక్సాతో విరాళాలను అందించవచ్చు. అందుకు స్మార్ట్‌ అసిస్టెంట్‌ను వాడుకోవాలి.

  • ఇంట్లో వేర్వేరుగా ఉండే గొంతులను అలెక్సా గుర్తిస్తుంది. పర్సనలైజ్డ్‌ అనుభవాలను అందిస్తుంది.

Updated Date - May 11 , 2024 | 02:44 AM