Share News

నాలుగేళ్లలో వేదాంతా రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - May 02 , 2024 | 03:55 AM

మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌కు చెంది న వేదాంతా గ్రూప్‌ భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో భారత్‌లోని గ్రూప్‌నకు చెందిన అన్ని వ్యాపారాల్లో 2,000 కోట్ల డాలర్ల...

నాలుగేళ్లలో వేదాంతా రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడి

ముంబై: మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌కు చెంది న వేదాంతా గ్రూప్‌ భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో భారత్‌లోని గ్రూప్‌నకు చెందిన అన్ని వ్యాపారాల్లో 2,000 కోట్ల డాలర్ల (రూ.1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అగర్వాల్‌ తెలిపారు. ప్రధానంగా టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్‌, గ్లాస్‌ వ్యాపారంతోపాటు గ్రూప్‌నకు చెందిన ఇతర కార్యకలాపాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయ న చెప్పారు. అలాగే, స్టీల్‌ వ్యాపారాన్ని సరైన ధర లభిస్తేనే విక్రయిస్తామని, లేని పక్షంలోనూ ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తామని అన్నారు.

Updated Date - May 02 , 2024 | 03:59 AM