Share News

సాగర్‌ సెమీ.. హైవోల్టేజ్‌ సెమీకండక్టర్స్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:31 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సాగర్‌ సెమీకండక్టర్స్‌ కంపెనీ హైవోల్టేజ్‌ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధమవుతోంది. జపాన్‌కు చెందిన హిటాచీ గ్రూప్‌ ఇందుకు అవసరమైన పూర్తి సాంకేతిక పరిజ్ఞానం...

సాగర్‌ సెమీ.. హైవోల్టేజ్‌ సెమీకండక్టర్స్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సాగర్‌ సెమీకండక్టర్స్‌ కంపెనీ హైవోల్టేజ్‌ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధమవుతోంది. జపాన్‌కు చెందిన హిటాచీ గ్రూప్‌ ఇందుకు అవసరమైన పూర్తి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. దీనికి సంబంధించి సాగర్‌ సెమీ-హిటాచీ గ్రూప్‌ కంపెనీ హిటా చీ పవర్‌ సెమీకండక్టర్‌ డివైజెస్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీఎస్‌డీఎల్‌) మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఏటా 10 కోట్ల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారు. ఈ ప్లాంట్‌లో పని చేసే ఉద్యోగులకు అవసరమైన పూర్తి శిక్షణ హిటాచీ గ్రూప్‌.. భారత్‌, జపాన్‌లోని తన యూనిట్లలో ఇస్తుంది. అయితే ఈ ప్లాంట్‌ను ఎక్కడ? ఎంత పెట్టుబడితో ఏర్పాటు చేసేది సాగర్‌ సెమీ వెల్లడించలేదు. దీనికి తోడు ఇన్సులేటెడ్‌ గేట్‌ బైపోలార్‌ ట్రాన్సిస్టర్స్‌ (ఐజీబీటీ), సిలికాన్‌ కార్బైడ్‌ వంటి హైపవర్‌ డివైజెస్‌ను ఉమ్మడిగా మార్కెట్‌ చేసేందుకూ హెచ్‌పీఎస్‌డీఎల్‌-సాగర్‌ సెమీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

Updated Date - Apr 19 , 2024 | 02:31 AM