Share News

ఆధార్‌ హౌసింగ్‌ నుంచి రూ.3,000 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - May 02 , 2024 | 04:05 AM

ప్రవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడి పెట్టిన ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ రూ.3,000 కోట్ల సమీకరణ కోసం ఈ నెల 8న ఐపీఓకు వస్తోంది....

ఆధార్‌ హౌసింగ్‌ నుంచి రూ.3,000 కోట్ల ఐపీఓ

న్యూఢిల్లీ: ప్రవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడి పెట్టిన ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ రూ.3,000 కోట్ల సమీకరణ కోసం ఈ నెల 8న ఐపీఓకు వస్తోంది. ఇందులో రూ.1,000 కోట్లు కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా, మరో రూ.2,000 కోట్లు బ్లాక్‌స్టోన్‌ అనుబంధ సంస్థ బీసీపీ టాప్కో షేర్ల విక్రయం ద్వారా సమీకరిస్తారు. ఈ నెల 10న ఈ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌ ముగుస్తుంది. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించే రూ.1,000 కోట్లలో రూ.750 కోట్లను కంపెనీ రుణ వితరణ కోసం వినియోగించనుంది. ఈ ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

Updated Date - May 02 , 2024 | 04:05 AM