Share News

ఫెడ్‌ రేట్లు యథాతథం

ABN , Publish Date - May 02 , 2024 | 04:03 AM

అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించే లక్ష్యంలో...

ఫెడ్‌ రేట్లు యథాతథం

న్యూయార్క్‌: అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించే లక్ష్యంలో పురోగతి లేకపోవడంతో 5.25-5.50 శాతంగా ఉన్న వడ్డీరేట్ల శ్రేణిని అలాగే కొనసాగించాలని నిర్ణయించినట్లు బుధవారం విడుదల చేసిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటనలో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఎంఓసీ) పేర్కొంది. ద్రవ్యోల్బణం క్రమంగా 2 శాతానికి తగ్గుతూ వస్తోందన్న విశ్వాసం బలపడే వరకు వడ్డీరేట్లను తగ్గించడం సరికాదని కమిటీ అభిప్రాయపడింది. గత ఏడాది జూలై నుంచి వడ్డీరేట్లు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. కమిటీ ప్రస్తుత వ్యాఖ్యలను బట్టి చూస్తే, వడ్డీరేట్ల తగ్గింపు ప్రక్రియ అంచనాల కంటే జాప్యం కావచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - May 02 , 2024 | 04:03 AM