Share News

అదానీ విల్మర్‌ లాభం రూ.156.75 కోట్లు

ABN , Publish Date - May 02 , 2024 | 04:06 AM

అదానీ విల్మర్‌ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.156.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం నమోదు చేసింది...

అదానీ విల్మర్‌ లాభం రూ.156.75 కోట్లు

న్యూఢిల్లీ : అదానీ విల్మర్‌ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.156.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 67 శాతం ఎక్కువ. అయితే ఇదే సమయంలో కంపెనీ ఆదాయం మాత్రం రూ.14,185.68 కోట్ల నుంచి రూ.13,342.26 కోట్లకు పడిపోయింది. ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ ఆదాయం, నికర లాభం పడిపోయాయి. నికర లాభం రూ.582.12 కోట్ల నుంచి రూ.147.99 కోట్లకు, ఆదాయం రూ.59,148.32 కోట్ల నుంచి రూ.51,555.24 కోట్లకు పడిపోయాయి.

Updated Date - May 02 , 2024 | 04:07 AM