Share News

రెండేళ్లలో రూ.5400 కోట్ల పెట్టుబడి : జేఎస్‌ఎల్‌

ABN , Publish Date - May 02 , 2024 | 03:58 AM

సామర్థ్యాల విస్తరణతో పాటు వృద్ధికి దోహదపడే కంపెనీల కొనుగోళ్లపై రెండేళ్లలో రూ.5400 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ప్రకటించింది...

రెండేళ్లలో రూ.5400 కోట్ల పెట్టుబడి : జేఎస్‌ఎల్‌

న్యూఢిల్లీ: సామర్థ్యాల విస్తరణతో పాటు వృద్ధికి దోహదపడే కంపెనీల కొనుగోళ్లపై రెండేళ్లలో రూ.5400 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఈ పెట్టుబడుల్లో సుమారు 90 శాతం అంతర్గత వనరుల ద్వారానే సమీకరించు కుంటామని కంపెనీ ఎండీ అభ్యుదయ్‌ జిందాల్‌ ప్రక టించారు. బుధవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావే శం అనంతరం ఆయన మాట్లాడుతూ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరిశ్రమలో ప్రపంచ ఆధిపత్యం సాధించడం లక్ష్యంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఒడిశాలోని జాజ్‌పూర్‌, హర్యానాలోని హిసా ర్‌లలో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉమ్మడి సామర్థ్యం గల రెండు ప్లాంట్లు తమ చేతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి మెల్టింగ్‌ సామర్థ్యాన్ని 42 లక్షల టన్నులకు పెంచాలన్నది తమ లక్ష్యమని, దానిపై రూ.700 కోట్లు ఖర్చు చేయనున్నామని అన్నారు. ఇది కాకుండా గుజరాత్‌లోని ముంద్రాలో పని చేస్తున్న 6 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల చెరోమెని స్టీల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 54 శాతం వాటాలను తాము కొనుగోలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై రూ.1340 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు.

Updated Date - May 02 , 2024 | 03:58 AM