Share News

హోంగార్డుల వేతనంలో కోత

ABN , Publish Date - May 02 , 2024 | 06:40 AM

ఎన్నికల విధులు నిర్వర్తించి సొంత ప్రాంతాలకు వచ్చిన హోంగా ర్డులకు సర్కారు షాక్‌ ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల విధులు నిర్వర్తించి వచ్చిన హోంగార్డులకు ఈనెల వేతనంలో రూ.3550 కోత విధించింది.

హోంగార్డుల వేతనంలో కోత

ఆంధ్రజ్యోతి - విజయవాడ

ఎన్నికల విధులు నిర్వర్తించి సొంత ప్రాంతాలకు వచ్చిన హోంగా ర్డులకు సర్కారు షాక్‌ ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల విధులు నిర్వర్తించి వచ్చిన హోంగార్డులకు ఈనెల వేతనంలో రూ.3550 కోత విధించింది.

ఇక్కడ కాకుండా పొరుగు రాష్ట్రంలో విధులు నిర్వర్తించారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభు త్వంలోని పెద్దలు చెబుతున్నారు. గత నెలలో మొదటి విడత ఎన్నికలు జరిగాయి.

ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల ను బందోబస్తుకు పంపారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ నుంచి సుమారుగా 200 మంది హోంగార్డులు అక్కడికి వెళ్లారు.

కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 1000 మంది వరకు హోంగార్డులు ఉన్నారు. 200 మందిని మాత్రం తమిళనాడుకు పంపారు. ఎన్నికల విధులకు బందోబస్తు నిమిత్తం ఒక రాష్ట్రంలోని పోలీసులు మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు వెళ్లడం సర్వసాధారణం.

ఇలా వెళ్లిన వారికి ఎన్నికల కమిషన్‌ ఖర్చులను చెల్లిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో గడచిన నెల 15వ తేదీన జరిగిన ఎన్నికలకు వెళ్లిన హోంగార్డులకు రూ.5550 ఎన్నికల ఫీడ్‌గా ఈసీ చెల్లించింది. తమిళనాడు ప్రభుత్వం ఇలా వెళ్లిన వారికి వసతి సదుపాయం మాత్రమే కల్పించింది.

భోజనాలకు సంబంధించి ఈసీ డబ్బులు చెల్లించినందుకు తమకేమీ సంబంధం లేదని అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసింది. బుధవారం ఒకటో తేదీ కావడంతో బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యయి. హోంగార్డుల నెల వేతనం రూ.21 వేలు. వాస్తవానికి ఖాతాల్లో ఈ మొత్తం జమవ్వాలి.

ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు తప్ప మిగిలిన వారందరికీ మొత్తం వేతనం జమయింది. తమిళనాడులో జరిగిన ఎన్నికల విధులకు వెళ్లిన వారికి వేతనంలో రూ.3550 కోత విధించారు.

Updated Date - May 02 , 2024 | 06:40 AM