Share News

Delhi: ‘ఉచిత బ్యాగేజీ’ పరిమితి తగ్గింపు..

ABN , Publish Date - May 06 , 2024 | 05:10 AM

దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాసులో ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గిస్తూ టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.

Delhi: ‘ఉచిత బ్యాగేజీ’ పరిమితి తగ్గింపు..

న్యూఢిల్లీ, మే 5: దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాసులో ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గిస్తూ టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.ఎకానమీ విభాగంలో కంఫర్ట్‌, కంఫర్ట్‌ ప్లస్‌, ఫ్లెక్స్‌ అనే మూడు ధరల కేటగిరీలు ఉంటాయి. ఇంతకాలం వీటిలో కంఫర్ట్‌లో 20 కేజీలు, కంఫర్ట్‌ ప్లస్‌లో 25 కేజీల వరకు బ్యాగేజీ అనుమతించగా, ఇకపై 15 కేజీలు మాత్రమే అనుమతిస్తారు. ఫ్లెక్స్‌ కేటగిరీలో మాత్రం 25 కేజీల వరకు అనుమతిస్తారు.

Updated Date - May 06 , 2024 | 05:10 AM