Share News

రాజా సింగ్‌, నూపుర్‌ శర్మల హత్యకు కుట్ర!

ABN , Publish Date - May 06 , 2024 | 06:12 AM

హిందూ నాయకుల హత్యకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో మత బోధకుడు మౌల్వీ సోహెల్‌ అబూబకర్‌ తిమోల్‌ (27)ను గుజరాత్‌లోని సూరత్‌ పోలీసులు అరెస్టు చేశారు.

రాజా సింగ్‌, నూపుర్‌ శర్మల హత్యకు కుట్ర!

గుజరాత్‌లో మతబోధకుడు మౌల్వీ సోహెల్‌ అరెస్టు

సూరత్‌, మే 5: హిందూ నాయకుల హత్యకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో మత బోధకుడు మౌల్వీ సోహెల్‌ అబూబకర్‌ తిమోల్‌ (27)ను గుజరాత్‌లోని సూరత్‌ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌, ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ, ఓ హిందీ టీవీ న్యూస్‌ ఛానల్‌ ప్రధాన సంపాదకుడు సురేష్‌ చహ్యాంకే, మరికొందర్ని హత్య చేయడానికి కుట్ర పన్నినట్టు సీనియర్‌ పోలీసు అధికారి అనుపమ్‌ సింగ్‌ గెహ్లోత్‌ చెప్పారు. మొదటి టార్గెట్‌గా హిందూ సనాతన్‌ సంఘ్‌ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్‌ రాణాను పెట్టకున్నాడని గెహ్లోత్‌ చెప్పారు.

Updated Date - May 06 , 2024 | 06:12 AM