Share News

2.10 లక్షల కోట్లు జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

ABN , Publish Date - May 02 , 2024 | 04:21 AM

వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) ఆదాయంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ నెలలో జీఎ్‌సటీ స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదిక 12.4 శాతం వృద్ధితో జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.2.10 లక్షల కోట్లకు పెరిగాయి...

2.10 లక్షల కోట్లు   జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

2.10 లక్షల కోట్లు జీఎ్‌సటీ వసూళ్లలో సరికొత్త రికార్డు

  • తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయికి..

  • ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,850 కోట్లు

    తెలంగాణలో రూ.6,236 కోట్ల వసూళ్లు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) ఆదాయంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ నెలలో జీఎ్‌సటీ స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదిక 12.4 శాతం వృద్ధితో జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.2.10 లక్షల కోట్లకు పెరిగాయి. 2017 జూలైలో జీఎ్‌సటీ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇదే తొలిసారి. ఆర్థిక వ్యవస్థ మరిం త బలం పుంజుకోవడంతో దేశీయంగా ఆర్థిక లావాదేవీలు, దిగుమతులు పెరగడం ఇందుకు దోహదపడిందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో జీఎ్‌సటీ ఆదాయం రూ.1.78 లక్షల కోట్లుగా, 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కాగా, గత నెలలో తెలంగాణ జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధితో రూ.6,236 కోట్లకు, ఆంధ్రప్రదేశ్‌లో 12 శాతం వృద్ధితో రూ.4,850 కోట్లకు పెరిగాయి.


ఆర్థికం జోరు, సమర్థవంతమైన పన్ను వసూళ్లతో ఈ రికార్డు సాధ్యమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ రికార్డు సాధనలో పన్ను అధికారుల కృషిని ఆమె కొనియాడారు. కాగా, ఆర్థిక వ్యవస్థలో చురుకుగా సాగుతున్న వ్యాపార కార్యకలాపాలు, పన్ను వసూళ్లు పెంచేందుకు అధికారులు చేపడుతున్న చర్యలతోపాటు పన్ను చెల్లింపుల విషయంలో వ్యాపారుల నిబద్ధతకు ఇది సంకేతమని పన్ను నిపుణులు పేర్కొన్నారు. పెరిగిన పన్ను వసూళ్లు భవిష్యత్‌ జీఎ్‌సటీ సంస్కరణలపై అంచనాలను పెంచనున్నాయని వారన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంతోపాటు విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజ వాయువు వంటి వాటిని జీఎ్‌సటీ పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడ్డారు.


ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతనెల మొత్తం జీఎ్‌సటీ ఆదాయంలో సెంట్రల్‌ జీఎ్‌సటీ వసూళ్లు రూ.43,846 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ వసూళ్లు రూ.53,538 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ (ఐజీఎ్‌సటీ) రాబడి రూ.99,623 కోట్లుగా ఉంది. సెస్సు రూపంలో మరో రూ.13,260 కోట్లు వసూలైంది. సాధారణ సెటిల్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఐజీఎస్‌టీ రాబడిలో రూ.50,307 కోట్లను సెంట్రల్‌ జీఎ్‌సటీలో, మరో రూ.41,600 కోట్లను స్టేట్‌ జీఎ్‌సటీలో జమ చేసింది. తదనంతరం, సెంట్రల్‌ జీఎ్‌సటీ రూ.94,153 కోట్లకు, స్టేట్‌ జీఎ్‌సటీ రూ.95,138 కోట్లకు చేరుకుంది. రాష్ట్రాలకు ఐజీఎ్‌సటీ బకాయిలేమీ పెండింగ్‌లో లేవని సీతారామన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రిఫండ్లను మినహాయించగా, గత నెలకు జీఎ్‌సటీ నికర వసూళ్లు రూ.1.92 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 15.5 శాతం అధికం. ప్రస్తుతం జీఎ్‌సటీ నెట్‌వర్క్‌లో 1.45 కోట్ల మంది రిజిస్టర్డ్‌ పన్ను చెల్లింపుదారులున్నారు.

Updated Date - May 02 , 2024 | 04:47 AM