డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ సాధించిన 8 రికార్డులు

రాజ్‌కోట్‌ టెస్టులో డబుల్‌ సెంచరీతో వీరవిహారం చేసిన యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్.. తన పేరిట కొన్ని చారిత్రాత్మక రికార్డులు లిఖించుకున్నాడు.

వైజాగ్, రాజ్‌కోట్‌ టెస్టుల్లో ద్విశతకం చేసిన యశస్వీ.. వినోద్‌ కాంబ్లీ, విరాట్‌ కోహ్లీల తర్వాత వరుస టెస్టుల్లో ద్విశతకం చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

వినూ మన్కడ్‌, విరాట్‌ కోహ్లీల తర్వాత ఒకే సిరీస్‌లో రెండు ద్విశతకాలు నమోదు చేసిన ఆటగాడిగా యశస్వీ చరిత్రపుటలకెక్కాడు.

టెస్టుల్లో ఇంగ్లండ్‌పై రెండు డబుల్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారత బ్యాటర్‌గా యశస్వీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు వసీం అక్రమ్‌ రికార్డు(12)ను యశస్వీ సమం చేశాడు.

ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున 10కిపైగా సిక్స్‌లు బాదిన మొదటి బ్యాటర్‌గా యశస్వీ నిలిచాడు.

అంతర్జాతీయ టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్‌గా యశస్వీ రికార్డ్ నెలకొల్పాడు.

టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(214*) చేసిన నాలుగో భారత బ్యాటర్‌‌గా యశస్వీ నిలిచాడు.

ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు (545) సాధించిన భారత లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.