మ్యాక్స్‌వెల్, ట్రావిస్ భార్యలపై ట్రోల్స్

క్రీడల్లో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. కానీ, కొందరు మాత్రం ఓటముల్ని అంత సులువుగా జీర్ణించుకోలేరు.

అలాంటి వాళ్లు కోపంతో రగిలిపోతూ.. ఇటరుల్ని టార్గెట్ చేసుకొని, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభిస్తారు.

తాజాగా ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్ భార్యలైన జెస్సికా డావీస్, విని రమన్‌లను కొందరు ఇండియన్స్ ట్రోల్ చేస్తున్నారు.

కేవలం ట్రోల్స్ మాత్రమే కాదు.. అత్యాచార బెదిరింపులకూ పాల్పడ్డారు. జెస్సికాతో పాటు ఆమె ఏడాది పాపని రేప్ చేస్తామన్నారు.

ట్రావిస్ హెడ్ సెంచరీ చేసి, ఆస్ట్రేలియాను గెలిపించాడు కాబట్టి.. కొందరు దుండుగులు అతని భార్య, కూతుర్ని  టార్గెట్ చేశారు.

అటు.. మ్యాక్స్‌వెల్ భార్యని కూడా ఉపేక్షించకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు చేశారు.

దీంతో.. మ్యాక్స్‌వెల్‌తో పాటు అతని భార్య విని రమన్‌లు దుండగులకు  స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

జట్టుకి ఎంత సపోర్ట్ చేసినా, ఇలాంటి ద్వేషపూరిత కామెంట్స్ తగదని, గౌరవించడం నేర్చుకోండని మ్యాక్స్‌వెల్ సూచించాడు.

విని రమన్ కూడా స్పందిస్తూ.. చిల్ పిల్ తీసుకొని, ప్రపంచంలోని ఇతర సమస్యలపై దృష్టి సారించాలని తూర్పారపట్టారు.