ఏడు రోజుల్లో ఏయే రంగు దుస్తులు  వేసుకోవాలో తెలుసుకుందాం..

సోమవారం రోజును శివుడి రోజుగా భావిస్తారు.తెల్లని దుస్తులు ధరించాలి.

మంగళవారం ఆంజనేయుడి రోజుగా పరిగణిస్తుంటారు.. ఈ రోజు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులను ధరిస్తే మంచిది

బుధవారం వినాయకుడికి ప్రీతికరమైన రోజు. గణేశునికి దూర్వా అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ రోజు పచ్చని బట్టలు ధరించండి.

గురువారాన్ని భగవంతుడు హరి రోజుగా భావిస్తారు. పసుపు రంగు ఈ దేవుడికి చాలా ప్రీతికరమైనది. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి.

శుక్రవారం లక్ష్మీ దేవి రోజు.ఈ రోజున మనం గులాబీ రంగు తెలుపు రంగును ధరించవచ్చు.

శనివారం శనిదేవుని రోజు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్లని దుస్తులు ధరించండి.

ఆదివారం సూర్య భగవానుడి రోజు ఈ రోజు మనం బంగారు, నారింజ రంగుల దుస్తులను ధరించాలి.