Today Horoscope: ఈ రాశి వారికి అన్ని ప్రయత్నాల్లోనూ విజయమే

27-04-2025 ఆదివారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు విషయంలో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. విలాలసాకు ఖర్చులు అధికం. సూర్యభగవానుడి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) వ్యక్తిగత సౌకర్యాలకు ఖర్చు చేస్తారు. మీ ప్రయత్నాలకు కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించడతో మనోవేదనకు గురవుతారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

27-04-2025 ఆదివారం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) మానసిక ప్రశాంతకు భంగం కలుగుతుంది. ప్రయాణాలు, చర్చల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా పూర్తవుతాయి. యోగధ్యానాలు సత్ఫలితాలనిస్తాయి.

27-04-2025 ఆదివారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, వడ్డీ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యతను గమనించాలి. అన్నదానం మేలు చేస్తుంది.

27-04-2025 ఆదివారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టం మీద లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల కలయిక లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌరవమర్యాదలకు భంగం కలగవచ్చు. గోమాత ఆరాధన శుభప్రదం.

27-04-2025 ఆదివారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) ప్రయాణాలు, చర్చలు కొంత వరకు ఫలిస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, ఈ వెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సూర్యభగవానుడి ఆరాధన శుభప్రదం.

27-04-2025 ఆదివారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. పన్నులు, బ్యాంక్‌లోన్‌ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పెన్షన్‌, మెడికల్‌ క్లెయిములు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అన్నదానం శుభప్రదం.

27-04-2025 ఆదివారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) ఆర్థిక లావాదేవీల్లో నిదానం పాటించాలి. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదుర్కొంటారు. న్యాయ వివాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. పందాలు పోటీలకు దూరంగా ఉండాలి. గోమాత ఆరాధన శుభప్రదం.

27-04-2025 ఆదివారం

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయినా చివరకు లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఫార్మా, హాస్టళ్లు, ఆహార రంగ వ్యాపారులకు కొంత నిరాశ ఎదరయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. అన్నదానం శుభప్రదం

27-04-2025 ఆదివారం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అ వసరం. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

27-04-2025 ఆదివారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. భూములు, ఇళ్ల క్రయవిక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హార్డ్‌వేర్‌, నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్‌ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. అద్దె వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అన్నదానం శుభప్రదం.

27-04-2025 ఆదివారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. డ్రైవింగ్‌లో నిదానం పాటించండి. రాతకోతల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. చెక్కులు, పత్రాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బంది పడతారు. గోమాతను ఆరాధించండి.