ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కోరుకున్న ఫలితాలు లభిస్తాయి

23-02-2026 సోమవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

వృషభం (ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు) సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలం.

23-02-2026 సోమవారం

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) దూరప్రాంతంలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎగుమతులు, టెక్స్‌టైల్స్‌, ప్రచురణల రంగాల వారికి లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా రంగాలకు చెందిన పెద్దలను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

23-02-2026 సోమవారం

కర్కాటకం ( జూన్‌ 22-.జూలై 23 మధ్య జన్మించిన వారు) సమావేశాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. యూనియన్‌ వ్యవహారాలు, బృందకార్యక్రమాలు, ప్రదర్శనలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఉన్నత విద్యకు నిధులు సర్దుబాటు అవుతాయి.

23-02-2026 సోమవారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పరమేశ్వరుని ఆరాధించండి.

23-02-2026 సోమవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాల కారణంగా లబ్ధి పొందుతారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. పరమ శివుని ఆరాధన శుభప్రదం.

23-02-2026 సోమవారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) వైద్యం, పరిశ్రమలు, హోటల్‌, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. రుద్రకవచ పారాయణ శుభప్రదం.

23-02-2026 సోమవారం

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది.

23-02-2026 సోమవారం

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పరిస్థితిని సమీక్షించుకుంటారు. వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు.

23-02-2026 సోమవారం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులకు సంబంధించి ఆనందకరమైన సమాచారం అందుతుంది. క్రీడలు, ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. అనుబంధాలు బలపడతాయి.

23-02-2026 సోమవారం

కుంభం (జనవరి 20-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. స్థిరాస్తి పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

23-02-2026 సోమవారం

12-12-2024  గురువారం

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) మార్కెటింగ్‌ , రవాణా, టీచింగ్‌, కమ్యూనికేషన్‌ రంగాల వారు కీలకమై నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలమైన రోజు. శుభవార్త అందుకుంటారు. రవాణా, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.