ఈ రాశి వారికి గుడ్ న్యూస్, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది

22-02-2026 ఆదివారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించి లాభాలు గడిస్తారు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు సంతృప్తిని ఇస్తాయి.

వృషభం (ఏప్రిల్‌ 21- మే 20 మధ్య జన్మించిన వారు) పదిమందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకారం సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాకు సంబంధించి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం.

22-02-2026 ఆదివారం

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి.

22-02-2026 ఆదివారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. సన్నిహితుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.

22-02-2026 ఆదివారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

22-02-2026 ఆదివారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.

22-02-2026 ఆదివారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) వర్తకులు, వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపానీయాల్లో నియామాలు పాటించడం వల్ల లాభం పొందుతారు. అదనపు ఆదాయం లభిస్తుంది.

22-02-2026 ఆదివారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. పందాలు, పోటీలు, ట్రేడింగ్‌లలో మంచి ఫలితాలు సాధిస్తారు.

22-02-2026 ఆదివారం

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కేటరింగ్‌, సేవలు, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సూర్యభగవానుడిని ఆరాధించండి.

22-02-2026 ఆదివారం

మకరం (డిసెంబరు 21-జనవరి 20 మధ్య జన్మించిన వారు) బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్‌ సందేశాలు, మెయిల్స్‌ అనందం కలిగిస్తాయి. ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. టెలివిజన్‌, ప్రకటనలు, చిట్‌ఫండ్‌లు, విద్యాసంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సృజనాత్మకంగా వ్యహరించి లక్ష్యాలు సాధిస్తారు.

22-02-2026 ఆదివారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు. ఫర్నీచర్‌ కొనుగోలు చేస్తారు. వేడుకలుకు ఏర్పాట్లు చేసుకుంటారు.

22-02-2026 ఆదివారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20-మార్చి20 మధ్య జన్మించిన వారు) కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు జరుగతాయి. సంకల్పం నెరవేరుతుంది.