నేటి రాశి ఫలాలు... 19-08-2026

19-08-2026 బుధవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. పన్నులు, పెన్షన్‌, బీమా వ్యవహారాలకు అనుకూలం.

వృషభం (ఏప్రిల్‌ 21- మే20 మధ్య జన్మించిన వారు) వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రియతముల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. స్థిరాస్తి రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు..

19-08-2026 బుధవారం

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో చర్చలు ఫలిస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

19-08-2026 బుధవారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, విద్య, క్రీడల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

19-08-2026 బుధవారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) బదిలీలు, స్థల మార్పులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాదిస్తారు.

19-08-2026 బుధవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. సన్నిహితులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు

19-08-2026 బుధవారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. డిపాజిట్లు, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన సమావేశాలు ఫలిస్తాయి.

19-08-2026 బుధవారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.

19-08-2026 బుధవారం

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. బంధుమిత్రులతో చర్చలు ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ప్రచురణ, బోధన, రవాణా, ఎగుమతులు, ఉన్నత విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు.

19-08-2026 బుధవారం

మకరం (డిసెంబరు 21-జనవరి 20 మధ్య జన్మించిన వారు) విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

19-08-2026 బుధవారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) వివాహ నిర్ణయాల్లో పెద్దల సలహా మేరకు నడుచుకోవడం మంచిది. సమావేశాల్లో గౌరవ, మన్ననలు అందుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లభిస్తుంది.

19-08-2026 బుధవారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20-మార్చి20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగపరమైన సమావేశాలు, చర్చలకు అనుకూలం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.