Today Horoscope: ఈ రాశి వారు పెట్టుబడులు ఆర్థిక లావాదేవీల్లో అంచనాలు అందుకునేందుకు అధికంగా శ్రమించాలి
18-11-2025 మంగళవారం
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెద్దలను స్మరించుకుంటారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో అంచనాలు అందుకునేందుకు అధికంగా శ్రమించాలి. ఇతరులను కలుపుకుని మంచి పనులు చేపడతారు. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
18-11-2025 మంగళవారం
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. వైద్యం, హోటళ్లు, ఫార్మా, సేవల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
18-11-2025 మంగళవారం
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పిల్లల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మక రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గౌరవ, మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికం. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
18-11-2025 మంగళవారం
సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, విందులకు ఏర్పాట్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఖర్చులు అఽధికం. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
18-11-2025 మంగళవారం
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
చర్చల్లో, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులకు సంబంధించిన సమాచారం అనందం కలిగిస్తుంది. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
18-11-2025 మంగళవారం
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. స్థిరాస్తి వ్యాపారులు నిదులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిధుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
18-11-2025 మంగళవారం
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాగ్వివాదాలు దూరంగా ఉండటం మేలు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. మెయిల్స్, సందేశాలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
18-11-2025 మంగళవారం
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కళలు, న్యాయ, ప్రచురణలు, బోధన, రవాణా, పర్యాటర రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దూరప్రయాణాలకు అవసరమైన నిదులు అందుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
18-11-2025 మంగళవారం
మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం లోపిస్తుంది. ఖర్చులు అధికం. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
18-11-2025 మంగళవారం
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేపించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
18-11-2025 మంగళవారం
12-12-2024 గురువారం
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లోపిస్తుంది. ఉన్నత విద్యకు అవసరమైన నిదులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.