Today Horoscope: ఈ రాశి వారికి ప్రయాణాలు,చర్చలు ఆనందం కలిగిస్తాయి దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు

11-01-2026 ఆదివారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) భాగస్వామి వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. గౌరవ పదవులు అందుకుంటారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) వృత్తిపరమైన సమావేశాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, పరిశ్రమలు, ఫార్యా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పట్టుదలతో కృషి చేసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.

11-01-2026 ఆదివారం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రియతముల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. అన్నదానం శుభప్రదం.

11-01-2026 ఆదివారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇల్లు, స్థల సేకరణ విషయాలు భాగస్వామితో చర్చిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గోసేవ శుభప్రదం.

11-01-2026 ఆదివారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. తోబుట్టువుల ఆరోగ్యం వెరుగుపడుతుంది. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

11-01-2026 ఆదివారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రీడలు, ఆడిటింగ్‌, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.

11-01-2026 ఆదివారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) ఇల్లు, స్థలమార్పునకు అనుకూలం. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గోసేవ శుభప్రదం.

11-01-2026 ఆదివారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించి ఒక శుభవార్త అందుకుంటారు.

11-01-2026 ఆదివారం

ధనుస్సు ( నవంబరు 23 - డిసెంబరు 22 మధ్య జన్మించిన వారు) ఆర్థికపరమైన సమావేశాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

11-01-2026 ఆదివారం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. గోసేవ శుభప్రదం.

11-01-2026 ఆదివారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

11-01-2026 ఆదివారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమావేశాల్లో గత అనుభం లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది.