Subrata Roy Wife: ఎవరీ స్వప్న..? సుబ్రతా రాయ్ భార్య గురించి విస్తుపోయే నిజాలు..!

1948వ సంవత్సరం జూన్ 10వతేదీన బీహార్ రాష్ట్రంలోని అరారియాలో సుబ్రతా రాయ్ జన్మించారు. రూ.2 వేలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 

సుబ్రతా రాయ్ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కోల్‌కతా‌లో స్వప్నను కలుసుకున్నారు. ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నారు. 

ఏడేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. స్వప్నకు సుబ్రతా ఎన్నో ప్రేమలేఖలు రాశారు. ఏడేళ్ల బంధం తర్వతా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు 

ఓ దశలో వ్యాపారం సజావుగా సాగకపోవడంతో భార్య నగలను కూడా సుబ్రతా తాకట్టు పెట్టారు. ఆ తర్వాత దిగ్గజ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు.

సుబ్రతా రాయ్ కుటుంబం ప్రస్తుతం విదేశాల్లో ఉంటోంది. ఆగ్నేయ ఐరోపా దేశమైన నార్త్ మాసడోనియాలో స్వప్న తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. 

సుబ్రతా భార్య స్వప్నా రాయ్‌పై 2017లో లుక్ అవుట్ నోటీస్ జారీ అయింది. అంతకు ముందే ఆమె దేశం దాటి వెళ్లి మాసడోనియా పౌరసత్వం తీసుకున్నారు. 

స్వప్న భారత పౌరసత్వాన్ని కూడా వదులుకున్నారు. మాసడోనియాలోనే మూడు భారీ వ్యాపారాలను ప్రారంభించాలని స్వప్న ప్రయత్నిస్తున్నారు.