కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని చింపి విసిరేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యానించారు.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రసంగించారు. కేంద్రంలోని పాలక వర్గం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాకపోతే పీఎస్‌యూలు, రైల్వేస్, ఇతర సంస్థలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని నిలదీశారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.