వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో సీతారామా రావు- రుక్మా బాయ్ దంపతులకు 1921 జూన్ 28వ తేదీన పీవీ నరసింహా రావు జన్మించారు.
పీవీ నరసంహా రావుకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగా రావు- రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు.
పదేళ్ల వయస్సులో పీవీ నరసింహా రావుకు సత్యమ్మతో పెళ్లి జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుతూళ్లు ఉన్నారు.
పీవీ నరసింహారావు మొదటిసారిగా 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1971లో నాలుగవ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పీవీ నరసింహా రావు పనిచేశారు.
పీవీ నరసిహారావు 1991 నుంచి 1996 మధ్య దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
పీవీ నరసింహా రావు బహుబాషా కోవిదుడు. ఆయన 17 బాషలను అనర్గళంగా మాట్లాడగలరు.
తెలుగుతోపాటు మరాఠి, బెంగాలి, గుజరాతి, హిందీ, కన్నడ, మళయాళం, ఒడియా, సంస్కృతం, తమిళ్, ఉర్దూ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, పెర్షియ భాషలు మాట్లాడే వారు.
పీవీ నరసింహా రావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఆ తర్వాత అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.