అసెంబ్లీలో ఘోర ఓటమి తరువాత బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవగా.. ఇప్పుడు కీలక నేతలు సైతం పార్టీ మారేందుకు రెడీ అయ్యారు.

కేటీఆర్ ప్రధాన అనుచరుడైన బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డిని రామ్మోహన్ కలిశారు.

సికింద్రాబాద్ గానీ, మల్కాజిగిరి ఎంపీ టికెట్ గానీ ఇవ్వాలని కోరారు.

త్వరలోనే తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నారు బొంతు రామ్మోహన్.

తెలంగాణ ఏర్పాటు తరువాత హైదరాబాద్ తొలియర్‌ బొంతు రామ్మోహన్.

గులాబీ దళపతి కేసీఆర్, కేటీఆర్‌కు చాలా క్లోజ్‌గా ఉండేవారు రామ్మోహన్.

బీఆర్ఎస్ టికెట్ ఇవ్వనందుకే ఆయన పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.