జుట్టు బాగా రాలిపోతోందా?  ఈ నూనెలు వాడితే మ్యాజిక్కే!

దారుణంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టి జుట్టు తిరిగి ఒత్తుగా పెరగడంలో ఈ నూనెలు సహాయపడతాయి.

జోజోబా ఆయిల్

నెత్తి మీద చర్మం ఉత్పత్తి చేసే సహజ నూనెల్లాగే జోజోబా ఆయిల్  తల మాడును సమతుల్యంగా ఉంచుతుంది. తేలికగా, తేమగా ఉండటం వల్ల జిడ్డు తల ఉన్నవారిలో హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేస్తుంది.

బాదం నూనె

బాదం నూనెలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు రాలిపోడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.

రోజ్మేరీ ఆయిల్..

రోజ్మెరీ చాలా శక్తివంతమైన నూనె. ఇది ఎసెన్షియల్ ఆయిల్ అయినా దీన్ని కొబ్బరి, బాదం, ఆలివ్ నూనెలతో కలిపి వాడతారు. స్కాల్ప్ లో రక్తప్రసరణ మెరుగుపరిచి జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

అర్గన్ ఆయిల్..

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం వల్ల అర్గన్ నూనె చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇది జుట్టు పగుళ్లు తగ్గించి జుట్టు రాలడాన్ని నివారిస్తంది.

ఆముదం..

పిల్లలకు కూడా ఉపయోగించే ఆముదం జుట్టు రాలడాన్ని కేవలం ఒక్కసారికే చాలా కంట్రోల్ చేస్తుంది. ఇందులో పోషకాలు సమృద్దిగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

కొబ్బరినూనె

నాణ్యత గల కొబ్బరినూనె జుట్టు రాలడాన్ని అరికడుతుంది. స్కాల్ఫ్ పొడిబారకుండా తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నూనె మజాజ్ వల్ల జుట్టు రాలడం ఆగుతుంది.