పల్లీలను చులకనగా చూడకండి..  ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయంటే.. 

శనగ పలుకులలో ఈ, బి విటమిన్లు, ఆరోగ్యకర కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 

పల్లీలు చాలా త్వరగా శక్తిని అందిస్తాయి. ఆకలిగా అనిపించినపుడు పల్లీలు తింటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. 

పల్లీలలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

పల్లీలలోని యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

శనగ పలుకులలోని విటమిన్-ఈ శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. 

పల్లీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

పల్లీలలోని హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. 

పల్లీలలోని రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.