రుచికరమైన క్యారెట్ వడలు..
తింటే అస్సలు వదలరు..!
ముందుగా ఒక కప్పు శనగపప్పుని.. బాగా కడిగి మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు శనగపప్పులోని నీరంతా కిందకు వంచేసి.. కొద్దిగా శనగపప్పుని పక్కన పెట్టుకొని మిగతా పప్పు మొత్తం మిక్సీలో వేసుకోవాలి.
పప్పుతో పాటు కొద్దిగా అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, అందులో మూడు చెంచాల బియ్యం పిండిని వేసుకోవాలి.
అందులోనే ఒక కప్పు క్యారెట్ తురుము, జీలకర్ర, కరివేపాకు తురుం, పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి వడల్లాగా చేసుకోవాలి.
తరువాత స్టవ్‌పై కడాయి పెట్టుకుని నూనె పోసుకుని బాగా వేడెక్కాక ఈ వడల్ని అందులో వేసుకోవాలి.
కాస్త ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ వడలు రెడీ.
Related Web Stories
కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందా.. ఉదయాన్నే వీటిని తీసుకోండి..
శనైశ్చరుడి అనుగ్రహం కోసం శనివారం చేయాల్సినవి ఇవే!
దర్శ అమావాస్య నాడు ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం!
హాలిడే రోజుల్లోనే హార్ట్ సమస్యలు.. ఎందుకు వస్తున్నాయంటే..