చలికాలంలో చుండ్రుతో  బాధపడుతున్నారా?

హెయిర్‌ డ్రయర్‌ను ఉపయోగించడం వల్ల మాడుకు నేరుగా వేడి తగులుతుంది. అధిక వేడి చుండ్రు తీవ్రతను పెంచుతుంది

పొడి టవల్‌తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవాలి.

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌-బి, జింక్‌ అందించే పదార్థాలు బాగా తీసుకోవాలి.

పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి.

మాడులో రక్త ప్రసరణ బాగా జరగాలంటే తరచూ జుట్టును దువ్వుతూ ఉండాలి. 

దానివల్ల మాడులో నూనెలు ఉత్పత్తి అవుతాయి. చుండ్రు తగ్గుతుంది.